కాణిపాకం స్వయంభు శ్రీవారి సిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ మేరకు క్యూలైన్లలో భక్తులు నిండిపోయి ఆలయ ప్రాంగణం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. స్వామివారి దర్శనార్థం సమయపాలన కావడంతో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో సురేష్ బాబులు పర్యవేక్షిస్తున్నారు.