కడప జిల్లాలో ఖరీఫ్ లో సాగు చేసిన టమాట పంట ప్రస్తుతం చివరి దశకు చేరడంతో దిగుబడులు తగ్గాయి. దీంతోపాటు మార్కెట్కు సరుకు తక్కువగా వస్తుండటంతో ధర కొంచెం కొంచెం ఎగబాకుతోంది. ఆగస్టు 1న రైతు బజారులో కిలో రూ. 11 ఉండేది. అది కాస్త పెరుగుతూ ప్రస్తుతం కిలో రూ. 28 పలుకుతోంది. బయటి మార్కెట్లో 30కి పైగా ఉంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతుబజార్ లోని కూరగాయల షాపుల నిర్వాహకులు తెలిపారు.