ఏపీలోని రాజమండ్రిలో లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతులు సూసైడ్ చేసుకున్నారు. తీసుకున్న డబ్బు చెల్లించకపోతే రమ్యలక్ష్మి ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తామని లోన్ యాప్ వారు బెదిరించడంతో ఈ నెల 5న లాడ్జిలో దంపతులిద్దరూ విషం తాగారు. ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.