రోడ్డుకు ఇరువైపులా జంగిల్ క్లియరెన్సు పోలీసులు బుధవారం చేపట్టారు. రాజాము రూరల్ సిఐ నవీన్ కుమార్, వంగర ఎస్సై లోకేశ్వరరావు ఆధ్వర్యంలో రోడ్డుకిరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు, తుప్పలను దగ్గరుండి తొలగించారు. వంగర మండలం లోని అరసాడ నుండి వంగర వరకు పోలీసులు తమ సొంత నిధులతో రోడ్ సేఫ్టీ నిమిత్తం జంగల్ క్లీయరెన్సు చేపట్టారు. దీనివలన వాహనచోదకులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తున్నారు. దీనివలన రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవకాశం ఉంటుందని రూరల్ సీఐ నవీన్ కుమార్ ఎస్సై లోకేశ్వరరావు తెలిపారు.