పూర్తిస్థాయిలో ఈక్రాప్ నమోదు చేయించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ అన్నారు. పులిచెర్ల మండలం మంగళంపేట ఆర్బీకేలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్బీకేల ద్వారా అందుతున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. దీని వలన నాణ్యమైన పంట దిగుబడి పొందడం జరుగుతుందన్నారు. అనంతరం ఆర్బీకేల ద్వారా రైతులకు అందుతున్న సేవలను ఆరాతీశారు.