మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బెయిల్ గడువు రేపటితో ముగియనుంది. అనంతబాబు తల్లి చనిపోవడంతో కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 11 గంటల లోపు అనంతబాబు సరెండర్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన లాయర్లు హైకోర్టులో రెండు బెయిల్ పిటిషన్లు వేశారు. రేపు ఈ పిటిషన్లపై హైకోర్టులో లాయర్లు తమ వాదనలు వినిపించనున్నారు.