టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి చేసిన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో నినాదాలు చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, విజయవాడలో కన్ను పొడిచిన వాళ్ళకు స్టేషన్ బెయిల్ ఇస్తారా? అని ప్రశ్నించారు. ఈ రెండు ఘటనలు పోలీసుల తీరును స్పష్టం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ కోసం పోలీసులు సాగిలపడడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.