విజయనగరం, కురుపాం: టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆయన నివాసంలో అధ్యక్షులతో ముఖాముఖిలో పాల్గొన్నట్లు కురుపాం నియోజకవర్గ ఇన్చార్జి తోయక జగదీశ్వరి తెలిపారు. చంద్రబాబునాయుడుతో భేటీ అనంతరం విలేకరులతో ఆమె ఫోన్లో మాట్లాడారు. కురుపాం నియోజకవర్గంలో పార్టీలో జరుగుతున్న కార్యక్రమాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసారన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు వెల్లడించారు.