డెంగ్యూతో భార్య చనిపోగా, 2 రోజులకే భర్త సూసైడ్ చేసుకున్న ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన గణేశ్(25), గగనశ్రీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈనెల 6న డెంగ్యూ జ్వరంతో గగనశ్రీ మృతి చెందింది. ఆమెను భర్త, అత్తమామలే చంపారని మృతురాలి తండ్రి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. భార్య దూరమైందనే బాధతో గణేశ్ గురువారం ఉరివేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.