కార్పొరేషన్ పరిధిలోని యర్రబాలెం గ్రామంలో హిందూ స్మశాన వాటిక ని రూ. 32 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. యర్రబాలెం స్మశాన వాటికి నందు ప్రహరీ గోడ, స్మశాన వాటికి మొత్తం గ్రావెల్ తో లెవెలింగ్ చేయుట, అంతర్గత సిసి రోడ్స్, ఎలక్ట్రికల్ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ లైట్లు ఏర్పాటు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే విధంగా పార్కు వలె బ్యూటిఫికేషన్ పనులను ప్రారంభించారు. ఎంతోకాలంగా ఈ స్మశాన వాటిక మెరక లేకపోవడం వలన కర్మ కాండలు జరుపుకోవడానికి చాలా ఇబ్బంది పడే వారమని ఇప్పుడు ఎమ్మెల్యే ఆర్కే చొరవతో హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులను ప్రారంభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.