ప్రభుత్వం ఇస్తున్న పౌష్టికాహారాన్ని అంగన్వాడీలోని గర్భిణీలకు బాలింతలకు పిల్లలకు తప్పగా అందించాలని సిడిపిఓ ఎస్ వెంకటరమణ పేర్కొన్నారు. పొన్నూరులోని శిశు సంక్షేమ కార్యాలయంలో అంగన్వాడి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేయటం వలన అక్షరాస్యత శాతం పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడి కేంద్రాల పరిధిలోని గర్భిణీలు బాలింతలు పిల్లల ఆరోగ్యం కోసం నిత్యం పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని తెలిపారు.