గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పొత్తూరు సమీపంలో వేరుశనగల బస్తాలతో వెళ్తున్న లారీ గురువారం జాతీయ రహదారిపై బోల్తా పడింది. నెల్లూరు నుంచి తెలంగాణ నల్లజర్ల వెళ్తున్న లారీ కొత్తూరు సమీపంలోకి వచ్చేసరికి డ్రైవర్ నిద్ర మత్తులో ఎడమవైపుకు నడిపినట్లు రోడ్డు భద్రతా సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు. సర్వీస్ రోడ్డులోకి వెళ్లేదిమ్మలపై ఎక్కిన లారీ బోల్తా పడింది. డ్రైవర్ తో సహా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.