సత్తెనపల్లి: మహిళపై హత్యాయత్నం కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ సత్తెనపల్లి జడ్జి తీర్పు ఇచ్చారు. సత్తెనపల్లి లోని 19వ వార్డుకు చెందిన తోట సురేష్ అదే ప్రాంతానికి చెందిన మహిళను బెదిరించి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమెపై అనుమానంతో 2017 జనవరి 21న అర్ధరాత్రి ఆమెపై హత్యాయత్నం చేశాడు. నిందితుడి పై అభియోగాలు రుజువు కావడంతో ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 12వేల జరిమానా విధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa