గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ లో రూ. 30 లక్షల నగదు అదృశ్యమైనట్లు పాత గుంటూరు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పిడుగురాళ్ళకు చెందిన మారం కోటేశ్వరరావు నాలుగు రోజుల క్రితం చెన్నైలో జరిగిన టెండర్లలో పాల్గొని తిరిగి గుంటూరుకు ఆర్టీసీ బస్సులో వచ్చారు. ఆ ప్రయాణంలో తన వెంట టెండర్ కోసం తీసుకెళ్లిన రూ. 30 లక్షల నగదు బ్యాగ్ బస్ దిగేటప్పుడు అదృశ్యమైందని ఫిర్యాదు చేశాడు.