కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప్పుడు బియ్యం తప్ప అన్ని బాస్మతీయేతర బియ్యంపై 20% మేర ఎగుమతి పన్నును విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా నూకల ఎగుమతులపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే ఎగుమతికి సిద్ధంగా ఉన్న వాటికి ఆంక్షల నుంచి మినహాయింపు కల్పించింది. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఈ మినహాయింపులు ఉంటాయని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa