అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు తలపెట్టిన పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి ఉత్తర్వులిచ్చారు. 'తిరుమలకు పాదయాత్ర సమయంలో షరతులతో అనుమతులిచ్చినప్పుడు వాటిని ఉల్లంఘించారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేశారు. మీపై 71 క్రిమినల్ కేసులు నమోదయ్యా యి. 2 కేసుల్లో శిక్ష పడింది. ఈసారి కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉంది. అందుకే అనుమతి నిరాకరిస్తున్నాం ' అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa