రాష్ట్రంలో ఇప్పటికే నువ్వా...నేనా అని తలపడుతున్న టీడీపీ, వైసీపీ పార్టీలకు తమ పోరుకు అసెంబ్లీ వేదిక కానున్నది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభా సమావేశాలు 5 రోజుల పాటు కొనసాగనున్నాయి. అదే సమయంలో ఈ నెల 15న ఉదయం 10 గంటలకు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మండలి సమావేశాలు కూడా 5 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో 3 రాజధానులకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టే దిశగా వైసీపీ సర్కారు కసరత్తు చేస్తోంది. అదే విధంగా పలు కీలక బిల్లులను కూడా ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa