హర్దోయ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. సుమారు 594 కిలోమీటర్ల దూరం, ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌గా నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే, భవిష్యత్తులో 8 లేన్లుగా విస్తరించే అవకాశం ఉంది. సుమారు 36,230 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్, యూపీలోని 12 జిల్లాల మీదుగా వెళ్తూ, మీరట్, ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రయాణ సమయాన్ని 12 గంటల నుంచి 6 గంటలకు తగ్గిస్తుంది. లాజిస్టిక్, ట్రాన్స్‌పోర్ట్ సామర్థ్యం పెరగడంతో పాటు, లాజిస్టిక్ ఖర్చులు తగ్గనున్నాయి. ఇందులో భాగంగా షాహజాన్‌పూర్‌లో నిర్మించిన 3.5 కిలోమీటర్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్‌ను రక్షణ రంగం కూడా ఉపయోగించుకోనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa