సమస్యలు ఎదురైనప్పుడు దైర్యంగా ఎదుర్కోవాలి కానీ ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడటం సబబు కాదని అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప కాగినెల్లి సూచించారు. ఇది ఆ కుటుంబానికి, సమాజానికి మంచిది కాద న్నారు. ప్రపంచ ఆత్మహత్యల దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బందికి, మహిళా పోలీసులకు ఆత్మహత్యల నివార ణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.