రాజకీయాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పుంగనూరు రూరల్ మండల ఎంపీపీ భాస్కర్ రెడ్డి చెప్పారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం పుంగనూరు మండలంలోని గనుగులగడ్డలో పర్యటించారు. సచివాలయ సిబ్బంది ప్రజల అవసరాలు గుర్తించి పనులు చేయాల్సివుందన్నారు. ఏఎంసీ చైర్మన్ నాగరాజరెడ్డి, ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, జడ్పీటీసీ సభ్యురాలు జ్ఞానప్రసన్న, ఎంపీడీవో రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.