చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం బూరంగమంద పంచాయతీ కొత్తవడ్డిపల్లె సమీపంలో సారా తయారీ కేంద్రాలపై ఎస్ఐ మారుతి సిబ్బందితో శనివారం దాడులు నిర్వహించారు. సారా తయారీకి సిద్ధం చేసిన ఊటను ధ్వంసం చేశారు. గ్రామ సమీపంలో తయారీకి సిద్ధంగా ఉంచిన 500 లీటర్ల ఊటను ధ్వంసం చేసి, 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బెల్లం ఊట, డ్రమ్ములను ధ్వంసం చేశారు. సారా తయారు చేస్తున్న వ్యక్తి మోహన్ పారిపోయినట్లు ఎస్ఐ తెలిపారు.