టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిందితులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసారు.తిరుపతి కార్పొరేషన్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం, మున్సిపల్ కమిషనర్ డ్రైవర్ హేమంత్, మరో ఉద్యోగి శివ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. 15 మంది నుంచి రూ.1.5 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు.