ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలో తరగతి గదుల డిజిటలీకరణలో భాగంగా స్మార్ట్, ఇంటరాక్టివ్ టీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సోమవారం పాఠశాల విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దశలవారీగా తరగతి గదుల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.