ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీచర్లు, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు 5,18,740 ట్యాబ్ లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. టీచర్లు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీపై సీఎం జగన్ సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5,18,740 ట్యాబ్ లను కొనుగోలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. అన్ని ట్యాబుల్లో బైజూస్ కంటెంట్ వేయించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.