ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు రాజ‌ధానుల నినాదంతో ఎన్నిక‌ల‌కు వెళ్లే ద‌మ్ముందా: చింతమనేని ప్రభాకర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 12, 2022, 08:52 PM

మూడు రాజ‌ధానుల నినాదంతో ఎన్నిక‌ల‌కు వెళ్లే ద‌మ్ము వైసీపీకి ఉందా? అని టీడీపీ నేత‌, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ సోమ‌వారం ఓ స‌వాల్ విసిరారు. మూడు రాజ‌ధానులు చేసి తీర‌తామంటున్న వైసీసీ... ఇప్ప‌టికిప్పుడు అసెంబ్లీని ర‌ద్దు చేసి అదే నినాదంతో ఎన్నిక‌ల‌కు రాగ‌ల‌దా? అని ఆయ‌న అడిగారు.  ఒకే రాష్ట్రం- ఒకే రాజ‌ధాని నినాదంతో ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి భూములు ఇచ్చిన రైతులు చేప‌ట్టిన దీక్ష‌లు సోమ‌వారం నాటికి 1,000 రోజుల‌కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని డిమాండ్ చేస్తూ రాజ‌ధాని రైతులు సోమ‌వారం అమ‌రావ‌తి నుంచి అర‌స‌విల్లి దాకా మ‌హా పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. ఈ యాత్ర ప్రారంభోత్స‌వంలో పాలుపంచుకున్న సంద‌ర్భంగా చింత‌మ‌నేని ఈ వ్యాఖ్య‌లు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com