ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఇద్దరు ఐఏఎస్ ల బదిలీ...జీవీఎంసీ కమిషనర్ గా రాజ‌బాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 12, 2022, 09:43 PM

ఏపీలో ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. ఇద్దరు ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం సోమ‌వారం నిర్ణ‌యం తీసుకుంది. గ్రేట‌ర్ విశాఖప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీవీఎంసీ) క‌మిష‌న‌ర్‌గా కొన‌సాగుతున్న ల‌క్ష్మీషాను ఆ పోస్టు నుంచి బ‌దిలీ చేసింది. ఏపీ అర్బ‌న్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కార్పొరేష‌న్ మేనేజింగ్ డైకెర్ట‌ర్‌గా ల‌క్ష్మీషాను నియ‌మించింది. ల‌క్ష్మీషా బ‌దిలీ నేప‌థ్యంలో జీవీఎంసీ నూత‌న క‌మిష‌న‌ర్‌గా రాజ‌బాబును నియ‌మించింది. ఈ మేర‌కు సోమ‌వారం ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa