ప్రతి ఓటరు ఆధార్ అనుసం ధానం తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉందని కలెక్టర్ కే. వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి ఆయన జిల్లాలోని తహసీల్దార్లు , వీఆర్వోలు , బీఎల్వోలతో కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లా డుతూ ఇప్పటివరకు జిల్లాలో 24. 81 శాతం మంది మాత్రమే ఆధార్ అనుసంధానం చేసి నట్టు వెల్లడించారు. గూడూరు నియోజకవర్గంలో 2, 41, 943 మంది, సూళ్లూరుపేటలో 2, 31, 255 , వెంకటగిరిలో 2, 44, 614 , చంద్రగిరిలో 2, 88, 652, తిరుపతిలో 2, 71, 810 , శ్రీకాళహస్తిలో 2, 41, 823 , సత్యవేడులో 2, 08, 068 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు.