పోలీసులు ఎవరినైనా అక్రమంగా అరెస్టు చేసినా, నిర్బంధించి కొట్టినా, హింసించినా, అసభ్య పదజాలంతో దూషించినా, థర్డ్ డిగ్రీ చేసినా సంబంధిత అధికారిపై బాధిత వ్యక్తి స్థానిక మేజిస్ట్రేట్ కోర్టుల్లో ప్రైవేటు కేసు పెట్టొచ్చు. ఈ చర్యలు చట్టబద్దం కావు. అరెస్టు, విచారణ సమయంలో నిబంధనలు పాటించని అధికారులపై శాఖాపరమైన చర్యలతోపాటు కోర్టు ధిక్కరణ చర్యలుంటాయి. సంబంధిత అధికార ఉద్యోగం కూడా శాశ్వతంగా పోతుంది.