విశాఖలోని రామకృష్ణ బీచ్ వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని వన్ టౌన్ పోలీసులు మంగళవారం గుర్తించారు. గంగాలమ్మ దేవాలయం దగ్గర, నావల్ కోస్టల్ బ్యాటరీ ఎదురుగా సముద్రం సమీపంలో మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె మృతి చెందింది రెండు మూడు రోజులు అయి ఉంటుందని భావిస్తున్నారు. మృతి చెందిన మహిళ వయస్సు సుమారు 50 నుండి 55 సంవత్సరాలు ఉంటుందని ఆమె ను గుర్తించిన వారు పోలీసులను సంప్రదించాలని కోరారు.