ఆసియా కప్ సిరీస్లో మోకాలి గాయం వల్ల ఆస్పత్రి పాలైన రవీంద్ర జడేజా నేడు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నాడు. త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు కూడా జడేజా దూరమయ్యాడు. మోకాలి గాయానికి చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన జడేజా ఆపరేషన్ తర్వాత కోలుకున్నాడు. తాజాగా తాను ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.