అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి గ్రామ రెవెన్యూ సర్వేనెంబర్ 171/1లో 6.6 ఎకరాల ప్రభుత్వ భూమిలో గత 40 సంవత్సరాల నుండి 6 మంది రైతులు మాగాణిసాగు చేసుకోవడం జరుగుతుంది. వీరిలో 5 మంది రైతులు వైసిపి అనుకూలులు మరొక ఎస్సీ రైతు ఇజ్రాయెల్ తెదేపా సానుభూతిపరుడు కావడంతో పొలంలోనికి వెళ్లకుండా అడ్డుకోవడం సరైన పద్దతి కాదు. ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటున్న రైతులందరికీ ఒకే రాజ్యాంగం అమలవ్వాలి తప్ప తెదేపా సానుభూతిపరునికి ప్రత్యేక రాజ్యాంగం అమలు చేయకూడదు...ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు అధికార పార్టీ నేతలకు వంతపాడడం మానుకోవలి అని టీడీపీ నాయకులూ గొట్టిపాటి రవి కుమార్ తెలియజేసారు.