టీడీపీ వాళ్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. పళ్లు రాలతాయ్..అని మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి ఆర్కే రోజా మాట్లాడారు. టీడీపీ 5 ఏళ్ళపాటు అధికారంలో ఉండి, కేవలం పచ్చ మీడియాలో గ్రాఫిక్స్ చూపించబట్టే ఈ ప్రాంతంలో (అమరావతి) ఉన్న రెండు ఎమ్మెల్యే సీట్లను 2019లో వైయస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ హయాంలో ఈ ప్రాంతంలో రైతులకు, ప్రజలకు న్యాయం చేయలేదని గుర్తించబట్టే వైయస్‌ఆర్‌సీపీని గెలిపించారు. పనికిమాలిన టీడీపీ వాళ్లు వైయస్‌ఆర్‌సీపీ గద్దెను, ప్రభుత్వాన్ని కదిలించేస్తామంటున్నారు. 29 గ్రామాల్లో మీరు, మీ బినామీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటానికి.. 26 జిల్లాల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటానికి ఎవ్వరూ ఒప్పుకోరు. అమరావతిలోని 29 గ్రామాల ప్రజలు మా జెండా పీకాలంటే.. 26 జిల్లాల్లోని ప్రజలు టీడీపీని కూకటివేళ్లతో సహా పెరికిపారేస్తారన్న సంగతి తెల్సుకోవాలి.