అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్దతుగా వేమూరు, అమృతలూరు, చుండూరు మండలాల ప్రజలు 18 లక్షల రూపాయల విరాళాలు మాజీమంత్రి నక్కా ఆనందబాబు చేతులమీదుగా కమిటీ వారికి గురువారం అందించారు. మాజీమంత్రి నక్కాఆనంద బాబు ఆధ్వర్యంలో వేమూరు, అమర్తలూరు, చుండూరు, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూలవర్షంతో ఘనస్వాగతం తెలిపారు. అమరావతి రైతులకి అండగా పాదయాత్రలో నక్కా ఆనంద్ బాబు రైతులతో కలసి నడిచారు.