ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణ ఘటన జరిగింది. నాగేంద్ర, నాగేశ్వరరావు ఇద్దరూ ఫ్రెండ్స్. వారిరువురూ ఓ యువతిని ప్రేమించారు. ఆ యువతి మొదట నాగేశ్వరరావుతో చనువుగా ఉంటూ ఈ మధ్యే నాగేంద్రతో మాట్లాడుతోంది. దీంతో ఆగ్రహానికి గురైన నాగేశ్వరరావు, నాగేంద్రపై కక్ష పెంచుకుని ప్రాణాంతక విషాన్ని టూత్ బ్రష్ పై రాశాడు. విషయం తన సోదరుడికి తెలియడంతో ఆ బ్రష్లను పడేశాడు. పోలీసులు నాగేంద్రను అరెస్ట్ చేశారు.