ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని కొన్ని మీడియా సంస్థలు భ్రష్టుపట్టిస్తున్నాయని.. పెట్రోల్, డీజిల్ పోసి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని సీఎం జగన్ ఆరోపించారు. నారా హమారా- అమరావతి హమారా అంటూ రాజధాని రైతులు యాత్ర చేస్తున్నారని.. వారికి ఇతర ప్రాంతాల అభివృద్ధి పట్టదని విమర్శించారు. నవరత్నాల ద్వారా రూ.1.65 లక్షల కోట్లు లబ్దిదారులకు అందించామన్నారు. జగన్ ప్రసంగం తర్వాత సభ రేపటికి వాయిదా పడింది.