ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లలకు చదివించలేకపోతున్నానని వ్యక్తి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 16, 2022, 01:28 PM

విజయనగరం: బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలో ఆనవరం గ్రామానికి చెందిన గొట్టాపు సీతంనాయుడు(48) అనే వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్‌ఐ ఆర్‌.జయంతి తెలిపా రు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. సీతంనాయుడుకు నాలుగేళ్ల కిందట రోడ్డు ప్రమాదం జరగడంతో ఇంటికే పరిమితమయ్యాడు. పిల్లలను సరిగ్గా చూసుకోలేక పోతున్నానని, సరైన చదువులు చదివించలేకపోతున్నానని మనస్థాపం చెందిన ఈయన బుధవారం మధ్యాహ్నం తన ఇంటిలో పురుగుమందు తాగాడు. వెంటనే బాడంగి సీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి 12 గంటలకు మృతిచెందా డు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com