గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 45వార్డుతా తాటిచెట్లపాలెం బజార్ ఏ ఎస్ ఆర్ నగర్, రామచంద్రనగర్-1 , 2, ప్రశాంతినగర్, ప్రిన్స్ అపార్ట్మెంట్ ప్రాంతాల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె. కె రాజు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనుక్ తో కలిసి గురువారం సాయంత్రం పర్యటించారు. కార్యక్రమంలో బాగంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ - ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు.
ఈ సందర్భంగా కె. కె రాజు మాట్లాడుతూ గతంలో రాజకీయ నాయకులను చూసాము కేవలం రాజకీయాలు కోసం, స్వార్థం కోసం రాజకీయాలు చేస్తే ఈయన పూర్తిగా సంపూర్ణ మనసుతో ప్రజలకు మంచి చేయాలని దృఢ సంకల్పంతో ఆయనకు ఉన్న సమయాన్ని మొత్తం కూడా ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వెచ్చిస్తున్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వై. యస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో 45వార్డు అధ్యక్షులు పైడి రమణ, డైరెక్టర్లు కె. పి రత్నాకర్, రాయుడు శ్రీను, 45వార్డు నాయకులు హరిపట్నాయక్, నాగరాజు, బాబురావు, గణపతి, నేపాల్ శ్రీను, బాబురావు, సన్నీ, ఆదిలక్ష్మీ, సువర్ణ, నాయుడు, తౌటమ్మ, ఈశ్వర రావు, యాదవ్ రాజు, రామారావు, నరసింగరావు, సీనియర్ నాయకులు చిరంజీవి, బి. గోవింద్, తిరుపతిరావు, షేఖ్ బాబ్జి, సునీల్, సత్తిబాబు, పావని, సచివాలయం సిబ్బంది, వాలంటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.