రాష్ట్ర విభజన నాటికి రూ.1.26 లక్షల కోట్లు అప్పు ఉండేది. ఆ అప్పు రూ.2.45 కోట్లకు చంద్రబాబు చేశారు అని వైసీపీ నాయకులూ అబ్బయ్య చౌదరి అసెంబ్లీ సమావేశాల్లో తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మేం రూ.8 లక్షల కోట్లు చేశామని ప్రతిపక్ష ఆరోపణలు చేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.100 కోట్లు మాత్రమే ఉందని యనమల రామకృష్ణుడు అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది మార్చి నాటికి కేవలం రూ.3,82,165 కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఉంది. మనం కేవలం రూ.1.15 కోట్లు మాత్రమే అప్పు చేశాం. ప్రజలకు అందించింది రూ. 1.25 లక్షల కోట్లు నేరుగా అందించాం.
దేశంలో మనమే అత్యధికంగా అప్పులు చేస్తున్నామని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఏ రాష్ట్రమైనా అప్పులుచేయడం సహజం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులపై ఇటీవల పార ్లమెంట్‌లో హిమాచల్ ప్రదేశ్ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఏపీ మొత్తం అప్పులు మార్చి నాటికి రూ.3,98,909 కోట్లు అని తేల్చారు. చంద్రబాబు దిగిపోయేనాటికి రూ.2,68115 కోట్లు అప్పలు ఉండేవని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వివరించారు.