అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఐదు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ నిషేధం విధించింది. డిజిటల్ కంటెంట్ నిబంధనలు - ఐటీ రూల్స్ 2021తో పాటు అశ్లీలతకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. మూడ్ ఎక్స్ వీఐపి, కోయల్ ప్లేప్రో, డిజి మూవీప్లెక్స్, అనుభూతి, జుగ్ను అనే ఐదు ఓటీటీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. గతంలో కూడా ప్రభుత్వం పలు ఓటీటీలను నిషేధించింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లు అర్థనగ్న, శృంగార వీడియోలను పోస్ట్ చేయడం వల్లే నిషేధం అమల్లోకి వచ్చింది. పిల్లలు, యువతను తప్పుదారి పట్టించే కంటెంట్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa