ఏపీఎస్ఆర్టీసీ మహిళలకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో భాగంగా, తాజాగా ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. పీఎం-ఈబస్ సేవ పథకం కింద కేంద్రం రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులను కేటాయించింది. వీటిలో విజయవాడకు 100 బస్సులు రానున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న ‘స్త్రీశక్తి’ పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే, కొత్తగా వచ్చే ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల మహిళా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, కాలుష్య రహిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ నిర్ణయంతో దూరప్రాంతాలకు వెళ్లే మహిళలతో పాటు, నగరాల్లో నిత్యం ప్రయాణించే వారికి కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా విజయవాడ వంటి రద్దీ నగరాల్లో 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రావడం వల్ల రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa