జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబరు 5న బస్సుయాత్ర ప్రారంభించాలని భావించారు.ఇప్పుడు పవన్ కల్యాణ్ నిర్ణయం మార్చుకున్నారు. అక్టోబర్లో తలపెట్టిన బస్సు యాత్రను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు కౌలు రైతుల భరోసా యాత్ర, జనవాణి కార్యక్రమాలను పూర్తి చేస్తామని వెల్లడించారు.ఈరోజు మంగళగిరి కార్యాలయంలో జనసేన లీగల్ సెల్ తో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పై విషయాలను వెల్లడించారు.