మహారాష్ట్రలోని థానే జిల్లా పాలట్ పడా గ్రామానికి ఇప్పటికీ స్కూల్, రోడ్డు, విద్యుత్ లేదు. చదువు కోసం పిల్లలు రాళ్ల మార్గంలో పక్క గ్రామానికి వెళ్లాల్సి వస్తోంది. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో కంటా చింతామన్(19) అనే యువతి ఓ పడవను ఏర్పాటు చేసి, విద్యార్థులను స్కూల్ కి తీసుకెళ్తోంది. డబ్బులు కూడా తీసుకోవట్లేదు. చింతామన్ ప్రాథమిక విద్యను పూర్తి చేసి చదువు ఆపేసింది.