రెండు ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన ఘటనపై కేసు నమోదయింది. మేడికొండూరు మండలంలోని పాలడుగు గ్రామానికి చెందిన జమ్మలమూడి రమేష్ అదే గ్రామం లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. వాహనాన్ని ఇంటి ముందు నిలిపారు. కాసేపటికి చూడగా వాహనం కనిపించలేదు. అదే సమయంలో గ్రామంలోని నందిగాం రామారావుకు చెందిన ద్విచక్ర వాహనం మాయమైనట్లు గుర్తించారు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు.