రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెనుకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల విశ్రాంతి భవనం ముందు విధులు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి, ఏ జి పి, సీనియర్ న్యాయవాది యం. భాస్కర్ రెడ్డి లో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయడం ద్వారా అటు కక్షిదారులకు, ఇటు న్యాయవాదులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా ఇందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు శివారెడ్డి, విశ్వనాథ్, మళ్ళిరెడ్డి, ఆసిఫ్, కమలాకర్ రెడ్డి, నాగార్జున, సుదర్శన్ రెడ్డి, వై. లక్ష్మినారాయణ, మధన్ మోహన్ రెడ్డి, విశ్వ నాథ్ నాయక్, శరత్ బాబు , శ్రీరాములు, రాజేష్ నాయక్, రమా పావని రాయల్, తదితరులు పాల్గొన్నారు.