గుంటూరు భార్య కేసు పెట్టిందని భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు శారదా కాలనికి చెందిన అశోక్ కు ఫిరంగిపురానికి చెందిన అంతోనిరాణికి అయిదేళ్ల క్రితం వివాహమైంది. భర్త మద్యం తాగి ఇంటికి వచ్చి ఆమెను వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వేధింపులు తట్టుకోలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన మనస్థాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లి భూలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa