ఓ వ్యక్తి మూత్రాశయంలో 10 సెంటీమీటర్ల మేకు ఉండటాన్ని వైద్యులు గుర్తించిన ఘటన మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో చోటుచేసుకుంది. జాగ్రామ్ అనే వ్యక్తి మూత్రాశయంలో తీవ్ర నొప్పితో ఆస్పత్రిరాగా డాక్టర్లు టెస్టులు చేశారు. ఎక్స్రే తీయగా 10 సెంటీమీటర్ల మేకు ఉన్నట్లు గుర్తించారు. గంట పాటు శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్లు ఆ మేకు తీశారు. ఇంతకీ అసలు ఆ మేకు ఎలా లోపలికి వెళ్లిందో ఆ వ్యక్తి తెలియదని తెలిపాడు.