స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నగర కమిషనర్ డా. జె అరుణ అధికారులను ఆదేశించారు. సోమవారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో "స్పందన" కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా నీటి సౌకర్యం కల్పించాలని రాజీవ్ నగర్ కు చెందిన పలు కుటుంబాల వారు వినతిపత్రం అందించారు. రోడ్డు, మురికినీటి కాలువల నిర్మాణం చేపట్టాలని సంతపేట తంగవేలు కాలనీవాసులు, మురుగునీరు వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని శివాజీ నగర్ వాసులు వినతి పత్రాలు అందించారు.
స్పందన కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం 6, మెప్మా 1, ప్రజారోగ్య విభాగం 1 చొప్పున మొత్తం 8 వినతులు అందాయి. గతవారం అందిన స్పందన వినతులపై కమిషనర్ శాఖాధిపతులతో సమీక్షించారు. వినతులను మార్గదర్శకాల మేరకు పరిష్కరించి, నిర్దేశించిన ఫార్మెట్లో పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్ గోవర్థన్, ఎంహెచ్వో అనిల్ కుమార్, ఎంఈ ధనలక్ష్మీ, డీడీలు, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.