ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిన్న వెంటనే నడవడం మంచిదేనా?

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 05:08 PM

చాలామంది భోజనం తర్వాత నడవడం మంచి అలవాటుగా భావిస్తారు. అయితే, తిన్న వెంటనే వేగంగా నడవడం వల్ల జీర్ణక్రియ మందగించడం, కడుపు నొప్పి, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం తర్వాత 10 నిమిషాలు ఆగి, నెమ్మదిగా, హాయిగా 10-20 నిమిషాలు నడవడం మంచిదని, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నడిచేటప్పుడు కడుపులో ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే ఆపేయాలని వారు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa