మే 2, 2026న, ప్రభుత్వం అత్యవసర హెచ్చరికల వ్యవస్థను పరీక్షించనుంది. ఈ పరీక్షలో భాగంగా, ప్రజల ఫోన్లలో సైరన్ మోగడంతో పాటు ఎమర్జెన్సీ అలర్ట్ సందేశాలు వస్తాయి. ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా ఈ సైరన్ వినిపిస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా ప్రమాదాల సమయంలో వేలమందికి సెకన్ల వ్యవధిలో సమాచారం చేరవేసి, ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. ప్రమాదం ఉన్న ప్రాంతాల్లోని ఫోన్లకు మాత్రమే ఈ సందేశాలు వెళ్లేలా టెక్నాలజీని రూపొందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa