రైతులు సాగు చేసిన వివిధ ఉద్యాన పంటలకు అడవి జంతువుల బెడద ఎక్కువైందని స్థానిక రైతులు ఆరోపించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలంలోని గూడుపల్లె, కాలువ పల్లె, దేవుల చెరువు, బురకాయలకోట, మద్దినాయునిపల్లె, సోంపల్లె తదితర గ్రామాల్లో చాలా మంది రైతులు బోరుబావుల కింద టమాటా, మొక్కజొన్న, వంకాయ, పంటలను సాగుచేశారు. రాత్రివేళలో జంతువులు పొలాల్లో ప్రవేశించి పంటలను ధ్వంసం చేస్తున్నాయని వాపోతున్నారు.